12 June, 2026 | 1:23 AM

చాకలిగూడలో సీసీ రోడ్డు ప్రారంభం

12-06-2026 12:11 AM

మొయినాబాద్ (విజయక్రాంతి): మొయినాబాద్ మండలం చకలిగూడ గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ రోడ్డుతో వర్షాకాలంలో ఎదురయ్యే బురద ఇబ్బందులు తొలగి, రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పడుతున్న మురికి రోడ్ల బాధలు ఈ సిమెంట్ రోడ్డుతో తీరాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.