తిప్పాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
09-08-2026 03:32 PM
భిక్కనూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీసీ రోడ్డు పనులను బీజేపీ నాయకులు ప్రారంభించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కేటాయించిన సుమారు రూ.8 లక్షల నిధులతో ఆసుపత్రికి ఇరువైపులా రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే నిధులు మంజూరు చేశారని నాయకులు తెలిపారు. రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తిప్పాపూర్ గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.






