9 August, 2026 | 4:48 PM

ముధోల్ ఎమ్మెల్యే పరమార్శ

09-08-2026 03:33 PM

భైంసా (విజయక్రాంతి): భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే  పవార్ రామారావు పటేల్  పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.