23 June, 2026 | 1:32 AM

కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు దోహదం

23-06-2026 12:00 AM

- సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం, జూన్ 22 : నేరాలు, దొంగతనాల  నియంత్రణకు, కేసులు ఛేదించదా నికి సీసీ కెమెరాలు దోహదపడతాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చెప్పారు. పల్లెల్లోకి కొత్త వ్యక్తులు వస్తే ఆరా తీయాలని సూచించారు. ‘మన పోలీస్ - మన ఊరు‘* కార్యక్రమంలో భాగంగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడికందుల గ్రామాన్ని సీపీ సోమవారం సందర్శించారు. ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 సీసీటీవీ కెమెరాలను, గ్రామ గ్రంథాలయా న్ని సీపీప్రారంభించారు.

మిరుదొడ్డి పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల గోడలపై గీసిన ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన చిత్రాలను పరిశీలించా రు. అనంతరం పాఠశాల విద్యార్థులు వేసిన ట్రాఫిక్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ థీమ్ రంగోలి పోటీలను ఆమె ఆసక్తిగా తిలకించారు. పాఠశాల విద్యార్థులతో సీపీ ముచ్చటించారు. డ్ర గ్స్కు దూరంగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే వెంటనే ’డయల్ 100’కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

బాలలపై  లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, చైల్ అబ్యూస్ గురించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివ రించారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెం టనే విలేజ్ పోలీస్ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని ధైర్యం చెప్పారు. అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు. గ్రా మ యువకులు, పోలీస్ టీమ్కు మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ ను సీపీ టాస్ వేసి ప్రారంభించారు. వేదికపై రోడ్డు భద్రత, డ్ర గ్స్ మహమ్మారిపై లఘు చిత్రాలను ప్రదర్శించారు.

స్థానిక విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, సామాజిక అవగాహన స్కిట్లు అందరినీ ఆలోచింపజేశాయి. గుడికందుల గ్రామంలో 10 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీ యమని సీపీ ప్రశంసించారు.మిగతా గ్రా మాలు కూడా స్ఫూర్తి పొంది సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు.

సభ అనంతరం సీపీ  గ్రామస్థుల స మస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య ల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు, వాలీబాల్ ఆటలో పా ల్గొన్న క్రీడాకారులందరికీ సీపీ హెల్మెట్లను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్, సీఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్‌ఐ సతీష్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.