11వ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు
- వార్డ్ కౌన్సిలర్ స్వాతి హరిబాబు దాతృతం
ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం
వనపర్తి మున్సిపాలిటీలో 11వ వార్డు ఆదర్శ వార్డు
నేరాల అదుపులో కెమెరాలు కీలకము
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కౌన్సిలర్
వనపర్తి టౌన్, మార్చి 1 : వనపర్తి పట్టణ మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఆదివారం ఆ వార్డు కౌన్సిలర్ స్వాతి హరిబాబు ఆర్థిక సహాయంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వార్డులో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం పట్ల ఆ వార్డు ప్రజలు కౌన్సిలర్ ను అభినందించారు. ఈ సీసీ కెమెరాలను సి ఐ కె ఎస్ రత్నం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వాతి హరిబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ వార్డు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన తాము ఎన్నికల ముందు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీసీ కెమెరాలు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎంతోమంది అమలు కానీ హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత చేతులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయని కానీ జీ ఆర్ ఫౌండేషన్ అధినేత జి రఘు మాట తప్పకుండా ఆయన కృషితో ఆయన ఆదేశాలు ఆలోచన విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ మేము ముందుకు వచ్చి జి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.
నేరాల అదుపులో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అనే విషయం ప్రజలు గమనించాలని ముఖ్యంగా వనపర్తి పట్టణ మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో కూడా తోటి కౌన్సిలర్లు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు శాంతిభద్రతల విషయంలో పూర్తి రక్షణ కల్పించే విధంగా ప్రజాప్రతినిధులుగా ఇటీవల గెలుపొందిన ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్ జి ఆర్ ఫౌండేషన్ అధినేత జి రఘు తో పాటు వార్డ్ కౌన్సిలర్ స్వాతి హరిబాబు , న్యాయవాది ఉత్తరయ్య, అచ్చుతాపురం గ్రామ సర్పంచ్ శాంతయ్య, నిరంజన్ గౌడ్, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ రెడ్డి, రఘు బంగాలి, తిరుపతయ్య, రఘు, జేమ్స్, జ్ఞానేశ్వర్, చుక్క పెంటయ్య, విజయ్, అబ్దుల్ వహీద్, అశోక్, నాగరాజు, పెద్ద ముక్కుల రవి, శివ, రాజు, గంగ ప్రసాద్, సాయికిరణ్, నాని తదితరులు పాల్గొన్నారు.




