2 March, 2026 | 2:29 AM

గ్రామ దేవత గుడిస్థలంపై అంతుచిక్కని అధికారుల వైఖరి

02-03-2026 12:38 AM
  1. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి కట్టబెట్టేందుకే ప్రయత్నమా? 

అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు 

అలంపూర్ మార్చి 1:రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో సర్వేనెంబర్ 1 లో ఉన్న గ్రామ దేవత లక్ష్మమ్మ మహాలక్ష్మి దేవి అవ్వ గుడి స్థలం విషయంలో అధికారుల వైఖరి పలు అనుమానాలకు దారి తీ స్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.దాదా పు కొన్నేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం గ్రా మంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చి మిగిలిన 9 సెంట్లు ప్రభుత్వ భూమిని గ్రామదేవత గుడి ,గుడి అవసరాలకు ఉంచినట్లు తెలిపారు.

ఇట్టి భూమిపై గతంలో కొంత వి వాదం రేగినప్పటికీ ఆ క్రమంలో రెండేళ్ల కిం దట అప్పటి ఎమ్మార్వో గ్రేషిబాయ్ సమక్షం లో స్థలాన్ని సర్వే చేయించి ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ భూమి అని నివేదించినట్లు గ్రామస్తులు తెలిపారు.అయితే ఇటీవలే అక్రమంగా అధికారులు మరోసారి సర్వే చేయించడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుని కన్ను ఈ గుడి స్థలంపై పడినట్లు.. అతనికి గ్రామ సెక్రటరీ కొందరు రెవె న్యూ అధికారులు సహకరిస్తున్నట్లు గ్రామస్తుల్లో చర్చ జరుగుతోంది.

ఈ గుడి స్థలం పైన గ్రామస్తులు వివరణ కోరుతూ.. అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ నెలలు గ డుస్తున్న సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావేస్తోందని దీంతో గ్రామంలో అంతర్గతంగా తప్పుడు సర్వేలు జరుగుతున్నాయా? అనే సందేహాలు గ్రామస్తుల్లో వి నిపిస్తున్నాయి.గ్రామ దేవత గుడి స్థలాన్ని కాపాడాలని అక్రమ సర్వేలను తక్షణమే రద్దుచేసి ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.