కల్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి ఏఎస్‌పీ చైతన్య రెడ్డి
కామారెడ్డి ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : కామారె డ్డి జిల్లాలో కల్తీకల్లు జోరు అనే శీర్షికతో మంగళవా రం విజయక్రాంతి దినపత్రిక లో వచ్చిన కథనానికి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి స్పందించారు. తన కార్యాలయంలో కల్లు ముస్తేదారులతో సమావేశం నిర్వహించారు. కల్లు ముస్తాదారులు కళ్ళు దుకాణం నడుపుకోవడానికి ఎక్సైజ్ అధికారుల నుండి అనుమతి పొందిన ప్రదేశంలో విక్రయించకుండా రద్దీగా ఉండే ఉగ్రవాయి దేవాలయాలు.
ఎల్లమ్మ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం మైసమ్మ దేవాలయం ప్రాంతంలో కల్తీకల్లు జోరుగా విక్రయిస్తున్నారని ఇది చట్ట విరుద్దమని విజయ క్రాంతి దినపత్రికలో మంగళవారం వచ్చిన వార్తకు స్పందించిన కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి కల్లు ముస్తాదారూలతో ఏ ఎస్ పి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కల్లు దుకాణాల్లో 18 ఏళ్లలో పిల్లలకు కల్లు విక్రయిస్తే యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చైతన్య రెడ్డి మంగళవారం కామారెడ్డి సబ్ డివిజన్ ఏరియాలోని కళ్ళు దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కల్లు దుకాణాల్లో కనీసo 6 సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.
కల్లు కాంపౌండ్ పరిధిలో 18 సంవత్సరాల లోపు పిల్లలు కనపడితే ఆ కాంపౌండ్ యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కామారెడ్డి పట్టణంలోని పరిసర గ్రామాలలోని కల్లు ముస్తదారులతో పాటు మండలాల పరిధిలోని కల్లు ముస్తదారు లతో సమావేశం నిర్వహించారు.




