14 August, 2026 | 2:59 AM

హిందూ, ముస్లింలు కాంగ్రెస్‌కు రెండు కళ్లు

14-08-2026 01:31 AM
  1. ముస్లిం కోటాను తెలంగాణలో కాదు.. ముందు గుజరాత్‌లో తొలగించే దమ్ముందా? 
  2. కేంద్రమంత్రి అమిత్ షాకు అప్పుడే సవాల్ విసిరాం 
  3. కాంగ్రెస్ ఉన్నంతకాలం లౌకిక వర్గాలవైపే 
  4. మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): హిందూ, ముస్లింలు కాంగ్రె స్ పార్టీకి రెండు కళ్లు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విష యం మాటల్లో కాదు.. సోనియాగాంధీ చేతల్లో చూపించారని అన్నా రు. ‘నాకు కూడా హిందూ, ముస్లింలు ఇద్దరూ సమానమే.. రెండు కళ్లు లాంటి వారు’ అని సీఎం పేర్కొన్నా రు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నంతకాలం లౌకిక వర్గాలవైపే ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నా రు. తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తే మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా అన్నారని, తెలంగాణలో కాదు ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని ఆనాడు మేం సవాల్ విసిరా మని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్  పటిష్టంగా అమ లు చేసిందన్నారు.

బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో గురువారం జరిగిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మైనారిటీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ, తమ  ప్రభుత్వంలో మైనారిటీలకు స ముచిత స్థానం కల్పించామన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మైనారిటీ నుంచి సభ్యుడిగా నియమించామని తెలిపారు. ఎవరూ అడగ కపోయినా మైనారిటీలకు దక్కాల్సిన స్థానాన్ని వారికి కల్పించామని, అజారుద్దీన్‌ను మంత్రి పద వి ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మైనారిటీ యువత గ్రూప్-1, గ్రూప్-2లలో  ఉద్యోగా లు సాధించారని తెలిపారు.  కొందరు గ్రూప్స్ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి ఆదుకోవాలని చూసి నా.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని సీఎం వివరించారు.

నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పించడం తో పాటు రూ. 3 కోట్లు నగదు బహుమతి అం దించామని, మహమ్మద్ సిరాజుద్దీన్ కోసం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని న్నారు. మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలని, జర్మనీ, జపాన్ దేశా ల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేశామని, నైపుణ్యం నేర్చుకోంటే.. అది మీ జీవితాలను మారుస్తుందని సూచించారు.

అందరి సహకారంతోనే  ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని స్పష్టంచేశారు. సర్ పేరు తో ఓట్లు తొలగించాలని ప్రయత్నిస్తున్నారని, బెంగాల్‌లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. ‘బెంగాల్‌లో మమతా బెనర్జీ వదిలేశా రెమో.. ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పాను అని ఆయన పేర్కొన్నారు. గల్లీ గల్లీ తిరగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతీ ఒక్క రి ఓటును చెక్ చేయండి. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడండి ప్రతీఒక్కరూ ఒక రేవంత్‌రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.