జైస్వాల్‌తో సియట్ ఒప్పందం
ముంబై, ఏప్రిల్ 6 : భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది. గత కొంతకాలంగా అటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటు ఐపీఎ ల్‌లో నిలకడగా రాణిస్తున్న జై స్వాల్‌తో ఒప్పందాల కోసం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ప్ర ముఖ టైర్ల కంపెనీ సియట్ జైస్వాల్ మల్టీ ఇయర్ డీల్‌ను కుదుర్చుకుంది. దీనికి సం బంధించి అధికారిక ప్రకటన చేసింది.కొత్త ఆర్థిక సంవత్సవరం నుంచే ఈ ఒప్పందం మొదలైనట్టు సియట్ తెలిపింది.
ఇకపై సియట్ కంపెనీ స్టిక్కర్ జైస్వాల్ బ్యాట్‌పై కనిపిస్తుంది. దీనికి గానూ సియట్ కంపెనీ ఏడాదికి కొంత మొత్తం చెల్లిస్తుంది. సియట్ కంపెనీ ఈ డీల్ విలువ ఎంతో వెల్లడించకున్నా ప్రస్తుతం జైస్వాల్ ఒక ఎండో ర్స్‌మెంట్‌కు ఏడాదికి 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటున్నాడు.దీని ప్రకారం చూస్తే సగటున రూ.4 కోట్ల వరకూ చెల్లించే అవకాశముంది. జైస్వాల్‌ను సియట్ కంపెనీ కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని, క్రికెట్‌తో తమ అనుబంధం మరింత బలంగా కొనసాగుతుందని ఆర్‌పీజీ గ్రూప్ వైస్ ఛైర్మన్ అనంత్ గోయెంకా చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్‌లో భాగమైన సియట్‌తో ఒప్పందం చేసుకోవడంపై జైస్వాల్ సంతోషం వ్యక్తం చేసాడు.




