యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్
ముంబై, ఏప్రిల్ 6: దేశవ్యాప్తంగా చిన్నారుల్లో ఉండే క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ 2026 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. గత రెండేళ్లుగా నిర్వహించిన ఈ పోటీలకు అద్భుతమైన స్పందన కనిపించడంతో మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు.
ఈ సారి 10 లక్షల మంది చిన్నారులే లక్ష్యంగా అథ్లెటిక్స్ కిడ్స్ కప్‌ను నిర్వహించబోతున్నారు. ప్రముఖ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబై, పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్,చెన్నైలతో పాటు మరిన్ని నగరాల్లో అథ్లెటిక్స్ కిడ్స్ కప్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.రన్నింగ్ , జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. 7 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో క్రీడానైపుణ్యాన్ని గుర్తించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




