calender_icon.png 20 December, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలంలో జ్ఞానేష్‌కుమార్‌ ప్రత్యేక పూజలు

20-12-2025 01:11:29 PM

శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌(Chief Election Commissioner Gyanesh Kumar) శనివారం పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దేవస్థానం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఉదయం 4.30 గంటలకు హారతి, అభిషేకం, కుంకుమ అర్చన, వేదాశీర్వచనం తదితర కార్యక్రమాల్లో సీఈసీ పాలుపంచుకున్నట్లు అధికారి తెలిపారు. 

"జ్ఞానేష్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వచ్చి అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శనివారం ఉదయం 4.30 గంటలకు ఆయన అభిషేకంలో పాల్గొని, ఆ తర్వాత కుంకుమార్చన, వేదాశీర్వచనం చేయించుకున్నారు." అని శ్రీశైలం అధికారి వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ భ్రమరాంబ అతిథి గృహంలో రాత్రి బస చేసి, ఆలయ సందర్శన పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరారని తెలిపారు.