27 July, 2026 | 10:20 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి

27-07-2026 09:49 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కలాం ఆశయాలు, మార్గదర్శకాలను అనుసరిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి,క్లబ్బు ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు ఆర్. అంజయ్య, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, మూలగుండ్ల వెంకట్ రెడ్డి, సభ్యులు రుపావత్ బాలు, మహేంద్ర, కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.