8 May, 2026 | 12:52 AM

గద్వాలలో ఘనంగా జనగణన 2027 అవగాహన ర్యాలీ

08-05-2026 12:02 AM

గద్వాల టౌన్ మే 7: భారత జనగణన 2027లో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు గద్వాల పట్టణంలో గురువారం అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కృష్ణవేణి చౌక్ నుంచి రాజీవ్ మార్గ్ వరకు సాగిన ర్యాలీలో మండల విద్యాశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ షాప్ డీలర్లు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించడానికి ఖచ్చితమైన జనాభా లెక్కలు అవసరమని వివరించారు. ప్రతి కుటుంబం ఎలాంటి భయం లేకుండా సరైన సమాచారం అందించాలని కోరారు.ర్యాలీలో ప్రజల్లో చైతన్యం కలిగించే నినాదాలు చేశారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ అజిత్, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.