27 April, 2026 | 7:12 PM

శతాధిక వృద్ధురాలి నేత్రాలు దానం

27-04-2026 04:09 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): పుట్టడు దుఃఖంలో సహితం తమ తల్లి డోలీ నరసమ్మ కళ్ళను దానం చేసి కుమారులు, కూతుళ్ళు తమ సామాజిక సేవాభవాన్ని చాటుకున్నారు. నేత్రదానంతో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన శతాధిక వృద్ధురాలు డోలి నరసమ్మ జీవితం ధన్యమనీ అంత్యక్రియల్లో పాల్గొన్న బందు మిత్రులు ప్రజలు ప్రశంసించారు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన డోలి నరసమ్మ( 103)  అనారోగ్యంతో మరణించారు.

వారి కుటుంబ సభ్యులు  జనహిత సేవా సమితి సభ్యులు డోలి సుకుమార్ వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖం లో ఉండి నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు.  L. V. ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ నేత్రాలని స్వీకరించారు.. నేత్రదాత శతాధిక వృద్ధురాలు డోలి నరసమ్మ  కుమారులు డోలి దశరథ్, విజయ్ కుమార్, శేఖర్, కోడళ్ళు, కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు, మనుమరాండ్లు కుటుంబ సభ్యులను ఆద్యంతం అభినందించారు.

సమాజ హితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉండి నేత్ర దానం ద్వారా ఇద్దరి అందులకు చూపునివ్వాలని నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయమని జనహిత సేవా సమితి  తరపున ఇది 14 వ నేత్రధానమని ఆ సంస్థ ప్రతినిధి సతీష్ తెలిపారు. డోలి నరసమ్మ  కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. L. V. ప్రసాద్ ఐ బ్యాంక్ వారు నేత్ర దాన సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన జనహిత సభ్యులు డోలి సుకుమార్,వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.