11-02-2026 02:36:39 AM
శంకర్‌పల్లి, ఫిబ్రవరి 10: రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం చెందిప్ప గ్రామ మరకత శివాల.య ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు స్వామి మంగళవారం సింహాచలం దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. వెంకట్రావును కలిసి మరకత శివాలయానికి రావాలని ఆహ్వానించారు.
ఈ ఓ ను శాలువతో సత్కరించి మరకత శివలింగం గల చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా దయాకర్ రాజు మాట్లాడుతూ ఈవో వెంకట్రావు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా శివాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్ కృష్ణవేణి, సినీ నటుడు స్వర్గీయ మల్లికార్జున రావు కుమారుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. మరకత శివాలయ క్యాలెండర్ను ఈవో వెంకటరావు ఆవిష్కరించారు.