ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఎర్రవల్లి,సెప్టెంబర్ 26:(విజయక్రాంతి): ఎర్రవల్లి చౌరస్తా,వేముల గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు, గ్రామ పెద్దలు స్మరించుకున్నారు. సామాజిక న్యాయం(Social Justice) కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచ్ కృష్ణసాగర్(Erravalli Sarpanch Krishnasagar), మండల అధ్యక్షుడు రామ్మోహన్, గౌరవ అధ్యక్షుడు బీచుపల్లి, ప్రధాన కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు తిమ్మప్ప, ఈధన్న, శివ, రాజు సింగోటం, గ్రామ పెద్దలు రాగన్న, పెద్ద లక్ష్మన్న, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం అని, ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నామని వారు పేర్కొన్నారు.