తూప్రాన్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
26-09-2026 | 09:56pm
తూప్రాన్, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ(Chakali Ilamma) విగ్రహం వద్ద రజక సంఘం(Rajaka Association) నాయకులు పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో రజక సంఘం సభ్యులు పోతరాజు ధనరాజ్, బాయికాడి నరసింహులు, పోతరాజు రాజు, పోతరాజు లింగం, చాకలి శ్రీశైలం, జర్నలిస్టు సిఆర్ జానకిరామ్ గౌడ్, మచ్చ యాదగిరి, విద్యాసాగర్, మామిడి వెంకటేష్, రజక సంఘం సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.