భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

26-09-2026 | 09:33pm

•న్యాయవాది రామడుగు రాజేష్ 

ధర్మపురి, సెప్టెంబర్25(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు ధైర్యసాహసాలకు, భూ హక్కుల పోరాటానికి(Land rights struggle) ప్రతీకగా నిలిచిందనీ ధర్మపురి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, న్యాయవాది రామడుగు రాజేష్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా రామడుగు రాజేష్ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ, పేదల భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఆమె గళమెత్తి పోరాడారనీ,తన భూమిని, పంటను కాపాడుకునేందుకు ఆధిపత్య వర్గాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ వెనుకడుగు వేయలేదనీ ఐలమ్మ పోరాటం, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందన్నారు.

ఐలమ్మ పోరాటం కేవలం తన భూమి కోసం మాత్రమే కాకుండా అణగారిన వర్గాల హక్కులు, మహిళా ఆత్మగౌరవం కోసం సాగిన ఉద్యమంగా చరిత్రలో నిలిచిందన్నారు. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు భూ పోరాటంలో భాగస్వాములయ్యారని తెలిపారు. వీరనారి ఐలమ్మ త్యాగం, తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిలబడే ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమం లో  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చల్లూరి రామచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జూపాక. కుమార్,నాయకులు ఎలుక రాజు యాదవ్, అల్లే వెంకటేశ్ యాదవ్, సతీశ్, పుట్టపాక. రాజయ్య, కుమార్, కొడురుపాక అనిల్, మంచికట్ల శేఖర్, నల్లూరి మల్లేశ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు