చాకలి ఐలమ్మ ది వీరోచిత పాత్ర

26-09-2026 | 09:29pm

ఘట్‌కేసర్‌,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)లో చాకలి ఐలమ్మ వీరోచిత పాత్ర పోషించిన గొప్ప నాయకురాలని పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు. శనివారం ఘట్ కేసర్ పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ 131వ జయంతి(Chakali illamma jayanthi) వేడుకలను ఘట్కేసర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్(Former MPP Bandaru Srinivas Goud), మున్సిపల్ మాజీ చైర్మన్ లు ముల్లి పావని జంగయ్య యాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, ఘనాపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్, టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి విప్పర్ల హనుమాన్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు, సలహాదారులు పొట్లచెరువు హనుమంతు, పగిడి ఆంజనేయులు, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు