చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

26-09-2026 | 09:48pm

మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన ధీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకొని శనివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో, మానసిక వికలాంగ సంరక్షణ కేంద్రం(Mentally handicapped care center)లో రజక సంఘం(Rajaka Sangha) నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షులు నిట్టూరి శ్రీనివాస్. పట్టణ అధ్యక్షులు మైసయ్య. దీపక్, శ్రీనివాస్. రాజు నీరజ్ నిఖిల్ సాయి సతీష్ హనీ. బబ్బులు చాతలశివ. రజక.సంఘం నాయకులు యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు