బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ
07-07-2026 08:08 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మాజీ ఉపసర్పంచ్ దండు శ్రీనివాస్ తండ్రి దండు ముత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, గోపు పరశురాం, ప్రతాప్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.






