27 June, 2026 | 2:18 PM

Breaking News

మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •   బాన్సువాడ కల్కి చెరువు కట్టకు బుంగ...   •  

చాంపియన్ దివ్య

14-06-2024 01:25 AM

గాంధీనగర్: భారత యంగ్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో క్రస్టెవా బెలోస్లవా (బల్గేరియా)పై దివ్య విజయం సాధించింది. మొత్తం 11 రౌండ్లు నిర్వహించిన ఈ టోర్నీలో 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. ఇందులో 9 విజయాలు, రెండు ‘డ్రా’లు ఉన్నాయి. తుదిపోరులో తెల్లపావులతో బరిలోకి దిగిన దివ్య ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ నుంచి అండర్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నాలుగో మహిళా ప్లేయర్‌గా దివ్య రికార్డుల్లోకెక్కింది. గతంలో కోనేరు హంపి (2001), ద్రోణవల్లి హారిక (2008), సౌమ్య స్వామినాథన్ (2009) ఈ ఘనత సాధించారు. బాలుర విభాగంలో భారత ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.