15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధైర్యసాహసాలకు మారుపేరు చత్రపతి

19-02-2026 06:04 PM

బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి  

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు    

మణుగూరు,ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దం స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ అని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి(Chhatrapati Shivaji Jayanti) వేడుకలను గురువారం పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్  ఏరియాలో చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సింగారం సర్పంచ్ మాధవరావు. బిజెపి నాయకులు పొడియం బాలరాజు. పున్నం బిక్షపతి, లింగంపల్లి రమేష్, మెరుగు రవీందర్ నాథ్ శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి ప్రధాన వీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ 

ఏరియాను చత్రపతి శివాజీ చౌరస్తాగా నామ కరణం చేశారు. శివాజీ చౌక్ వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ,ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ చరిత్రను తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.  దేశం కోసం, ధర్మం కోసం, ఛత్రపతి 

శివాజీ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండే రామాయణం, మహాభారతం, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రలను తెలియజేయాలన్నారు. అప్పుడే ధర్మం, దేశం అలాగే స్త్రీల పట్ల గౌరవం పెరుగు తుందన్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం పట్టణ ప్రముఖులు తమవంతుగా సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో  చత్రపతి యువసేన అధ్యక్షులు దుగ్గి బ్రహ్మతేజ, సూత్రపు నాగభూషణం, మారేష్. వెంకటేశ్వర్లు,రవి కుమార్, భాను ప్రకాష్, నిఖిల్,  నరేష్, సాంబ, లోకేష్ చారి, రమేష్, శివప్రసాద్ పాల్గొన్నారు.