15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం

19-02-2026 05:52 PM

చండూరు,( విజయ క్రాంతి): మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని సుందరయ్య కాలనీ యూత్ నాయకులు   అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతినిపురస్కరించుకొని.. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోశివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, శివాజీ  తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.

ప్రభుత్వం ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలని, అలాగే చత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మొగలుల అరాచకాలు, పైశాచికత్వం నుంచి ప్రజలను విముక్తి కల్పించాలనే లక్ష్యంతో హిందూ రాజస్థాపన కోసం పోరాడిన మహాయోధుడు చత్రపతి శివాజీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రావుల మల్లయ్య, నాగిళ్ల లక్ష్మణ్,బురుకల రాజు, కట్ట నిశాంత్,బురుకల సైదులు, అయితగోని మహేష్, నారపాక శివ, నరపాక స్వామి, నారపాక సాయి, కొత్తపల్లి అనిల్ పాల్గొన్నారు.