పారిశుద్ధ్య పర్యవేక్షణలో కమిషనర్
ఉదయం 6గంటలకు నగర పర్యవేక్షణ చేసిన నూతన కమిషనర్ యాదగిరి.
చేవెళ్ల:(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ నూతన కమిషనర్(Chevella Municipal Commissioner)గా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి ఉదయం 6గంటలకే నగరంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ... ప్రధాన రహదారుల గుండ తిరుగుతూ... కార్మికుల పనితీరు పారిశుధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
నగరం చివరిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, స్పోర్ట్స్ స్టేడియం, సిపిఐ కాలనీ, రంగారెడ్డి నగర్, విలేజ్ రోడ్డు, షాబాద్ చౌరస్తా ఇంద్రారెడ్డి దేవాలయ పుష్కరిని ఆవరణం, మధుర నగర్... పర్యవేక్షించారు. కొంత మంది ఉదయం బోర్ పైప్ తో పబ్లిక్ నడిచే రోడ్లు కడగడం చేసి ఆచర్యం వ్యక్తం చేశారు. కాలనిలో ఒకరిద్దరు బోర్ పైపు వేసి రోడ్లు కడగడం వల్ల దారి పొడుగున నీరు ప్రవహించంతో కలికడకన వెల్లే వారి ఇబ్బంది పడడం మంచిది కాదని చెప్పారు. దీంతో పాటు లక్షలు వెచ్చించి వేసిన రోడ్లు నిత్యం నీటితో తడవడం వల్ల డ్యామేజ్ అవుతాయాని తెలిపారు.
ఈ సమస్య పై ప్రజలకు అవ్యార్ నెస్ కల్పిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలను ప్రజలు గుర్తెరుగాలని కోరారు. స్పోర్ట్స్ స్టేడియంలో వ్యాయమం చేస్తున్న ప్రజలతో వారు మాట్లాడారు. ఈ ప్రాంతం స్థితి గతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే పొద్దు పొడిచిన యాల విధులు నిర్వర్తించడం పట్ల పలువురి దృష్టిని ఆయన ఆకర్షించారు.






