సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం
- వరి, మామిడి, కూరగాయల రైతులకు అపార నష్టం
- రోడ్లపై ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు నీటిపాలు
నంగునూరు, మే 6 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఎండ తర్వాత అకస్మాత్తుగా విరుచుకుపడ్డ గాలివాన మండలంలోని పలు గ్రామాల్లో బీభ త్సం సృష్టించింది. ఈ అకాల వర్షం వరి, మామిడి, కూరగాయల రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉం చిన వరిధాన్యం తడిసి ముద్దయింది.
కొన్నిచోట్ల కాంటా పూర్తయి లారీల్లోకి లోడ్ చేస్తు న్న సమయంలో వర్షం రావడంతో ధాన్యపు బస్తాలు పూర్తిగా నానిపోయాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు సైతం నీటిపాలయ్యాయి. కోత దశలో ఉన్న మామి డి కాయలు నేలరాలడంతో తోటల రైతులకు భారీనష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతు న్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు.






