ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
లౌకిక దృక్పథం గల గొప్ప పరిపాలకుడు చత్రపతి శివాజీ.
భిక్నూర్,(విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Jayanti celebrations ) భారత దేశ చరిత్రలో గొప్ప యోధుడని అని సౌత్ క్యాంపస్ మాజీ ప్రిన్సిపల్ డా.కవిత తోరణ్ అన్నారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సౌత్ క్యాంపస్ లో కార్యక్రమంలో భాగంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ పరి పాలనలో మత సహనం ముఖ్య లక్షణంగా కనిపించిందని.తన రాజ్యంలో హిందువులతో పాటు ముస్లింలకు కూడా సమాన గౌరవం ఇచ్చారని అంతేకాకుండా సైన్యంలో ముస్లిం సైనికులు, అధికారులు పనిచేసినట్లు చరిత్ర చెబుతుంది అన్నారు.
మసీదులు, దర్గాలు ధ్వంసం చేయవద్దని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. శివాజీ చేసిన యుద్ధాలు మతపరమైనవి కాకుండా రాజకీయ పరంగా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. మొఘల్ సామ్రాజ్యం, బీజాపూర్, ఇతర రాజ్యాలతో పోరాడి స్వతంత్ర స్వరాజ్యం స్థాపన కోసం ఎనలేని కృషి చేశారన్నారు. అవగాహన లేమితో ఆయనను కొందరు ముస్లింలకు వ్యతిరేకిగా ముద్రించారు. విద్యార్థులు చరిత్రను సరైన కోణంలో చదివి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచాలన్నారు. శివాజీ పరిపాలనలో ప్రజల సంక్షేమం, న్యాయం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడనీ,అందుకే ఆయన భారతదేశ చరిత్రలో గొప్పఆదర్శ పరిపాలకుడిగా నిలిచాడనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డా. సునీత, డా. సరిత , అధ్యాపకులు డా. నారాయణ, డా. నర్సయ్య జూనియర్ అసిస్టెంట్ విశ్వ భరత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




