calender_icon.png 19 February, 2026 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

19-02-2026 05:19:35 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ మహరాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. గురువారం అమీర్ పేట్ డివిజన్ లో జనతా రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనలో చూపిన ప్రతిభ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వేడుకల్లో భక్తి గీతాలు, నినాదాలు, ర్యాలీ నిర్వహించి శివాజీ మహారాజ్ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.