14-11-2025 09:44:32 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శుక్రవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని నందనం గ్రామానికి చెందిన గజ్జెల్లి నిరోషా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి రూ. 2 లక్షల 50 వేల రూపాయలు ఎల్ఓసి కాపీనీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు నిరోషా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నావంతు సహాయ సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దని, ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి ప్రభుత్వం ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా గజ్జెల్లి నిరోషా కుటుంబసభ్యులు ఎమ్మెల్యే నాగరాజు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు.