14-11-2025 08:17:36 PM
భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మైనార్టీల సంక్షేమం, వికలాంగులు, సీనియర్ పౌరులు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ మాత్యులు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం భద్రాచలంలో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటలకు తన నివాసం జగిత్యాల జిల్లా ధర్మపురి నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు ఐటిసి గెస్ట్ హౌస్ సారపాకకు చేరుకుంటారని, మధ్యాహ్నం రెండు గంటలకు భద్రాచలం ఐటీడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో రాష్ట్రస్థాయి జన్ జాతీయ గౌరవ దివస్, భగవాన్ బిర్ష ముండా 150 వ జయంతి వేడుకలలో పాల్గొన్న అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఐటీడీఏ సమావేశం మందిరంలో ఐటీడీఏ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.