24 March, 2026 | 11:22 PM

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

24-03-2026 09:37 PM

నారాయణరావుపేట గ్రామ సర్పంచ్ బొంగురం ఎల్లారెడ్డి

సిద్దిపేట రూరల్: మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణరావుపేట గ్రామ సర్పంచ్ బొంగరం ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లో నిర్వహించిన బాల మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో ఫ్రీ స్కూల్ కార్యక్రమాలైన ఆటపాటలతో పాటు కథలు చెప్పడం సృజనాత్మకతను వెలికి తీసే వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబెర్స్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సి ఆర్ పి డిస్టిక్ కోఆర్డినేటర్ ఏఎన్ఏంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.