ధనుష్ 'ఇడ్లీ కడై' తెలుగు హక్కులు చేజిక్కించుకున్నది ఎవరంటే...
హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఇడ్లీ కడై'(Idli Kadai) ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్(Nithya Menen). ధనుష్ కు ఇది నటుడిగా 52వ చిత్రం కాగా, ఆయన డైరెక్షన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. అయితే ఈ సినిమాను తెలుగు హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు. ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన 'విడుదల 2' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు.
ధనుష్ కథానాయకుడిగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా తర్వాత మరోమారు ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' కావటం వల్ల ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్ గా పనిచేస్తుండగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






