మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి రిమాండ్
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని మన్‌సాన్ పల్లి గ్రామానికి చెందిన పట్నశెట్టి సంగమేశ్వర్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని మునిపల్లి పోలీసులు శుక్రవారం రిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా మండలంలోని బుదేరా చౌరస్తాలో ఎస్ఐ అరవింద్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన పట్నశెట్టి సంగమేశ్వర్ మద్యం తాగి వాహనం నపుడుతున్నాడు.
దీంతో బ్రెత్ అనలైజర్ పరీక్షలో 550ఎంజీ/100ఎంఎల్ (బీఏస) రావడంతో అతనని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మీ కళ సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా అందుకు సదరు వ్యక్తికి నాలుగు రోజుల పాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించి సంగారెడ్డి జైలుకు తరలించినట్లు ఎస్ఐ అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అరవింద్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని, అలా చేస్తే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






