ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటుచేసుకోవాలి
పెద్దపల్లి డిఎల్పిఓ దేవకిదేవి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని పెద్దపల్లి డిఎల్పిఓ దేవికి దేవి అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నీలగిరి దివ్య దర్శన్ రావు అధ్యక్షతన మండల పరిధిలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో జలసిరి కార్యక్రమము, పారిశుద్ధ్య కార్యక్రమాలపై తగు సూచనలు చేశారు, జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తోపాటు ప్రతి హ్యాండ్ బోర్ వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంత అలాగే ప్రతి గ్రామానికి 5 పంట కుంటలు తప్పకుండా నిర్మించాలని దేవకీదేవి అన్నారు, అలాగే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామాలలో ఎక్కడైనా నీరు నిలువ ఉండి పారిశుధ్య సమస్యలు ఏర్పడితే వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని, దోమల బెడద లేకుండా క్రమము తప్పకుండా ఫాగింగ్ చేయించాలని సర్పంచులకుసూచించారు.






