31 July, 2026 | 8:26 PM

Breaking News

వర్షలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •  

'హరిహర వీరమల్లు' మూవీ నుంచి రెండో పాట 'కొల్లగొట్టినాదిరో' వచ్చేది ఆ రోజే

15-02-2025 11:27 AM

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న "హరి హర వీరమల్లు"(Hari Hara Veera Mallu) చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె ఫస్ట్ టైమ్ పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో..' రిలీజ్(Hari hara veera mallu second single) అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 24న ఈ పాట విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిధి అగర్వాల్(Nidhhi Agerwal) బ్యూటిఫుల్ మేకోవర్ తో ఆకట్టుకుంటోంది. పాటలో లిరిక్స్ లాగే ప్రేక్షకుల మనసు కొల్లగొట్టేలా ఉందనిపిస్తోంది నిధి.

ఈ పోస్టర్ లోని నిధి అగర్వాల్ స్టిల్.. ఆమె 'హరి హర వీరమల్లు'కు వర్క్ చేసిన ఫస్ట్ డే షూటింగ్ నుంచి తీసింది కావడం విశేషం. పవర్ స్టార్(power star pawan kalyan)తో వర్క్ చేయడం తన కెరీర్ లో మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ అని, ఈ సినిమాతో తాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మరింతగా చేరువవుతానని నమ్మకంగా చెబుతోంది నిధి అగర్వాల్. మార్చి 28న 'హరి హర వీరమల్లు' థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.