17 April, 2026 | 3:23 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆ నమ్మకం ఇచ్చింది చిరంజీవే

01-06-2025 12:00 AM

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా ‘25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ను అభినందించారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “టీనేజీలో ఒక్కసారి చిరంజీవిని దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 పూర్తయింది. ‘లెట్స్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవే. కొన్ని తరాలకు స్ఫూర్తి నింపిన పర్సనాలిటీ ఆయన. ‘మనం కలల వెంట పరుగులు తీస్తే విజయం మనను అనుసరించి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవే.

అందుకే నా ఈ 25 ఏళ్ల సెలబ్రేషన్స్‌ను ఆయనతోనే చేసుకోవాలనిపించింది. ‘థాంక్యూ సర్ ఈ క్షణాల్లోనే కాదు, నా టీనేజ్ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్ కమ్ముల రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’తో అలరించడానికి సిద్ధమయ్యారు. జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.