5 July, 2026 | 12:13 PM

అంజన్ రెడ్డికి ఘనంగా సన్మానం

05-07-2026 11:35 AM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన త్రిపురం అంజన్ రెడ్డిని శనివారం ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాందుమియా ఆధ్వర్యంలో కీతవారిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు త్రిపురం అంజన్ రెడ్డిని పూలమాలలతో శాలవాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అంజన్ రెడ్డి మాట్లాడుతూ తనపై మరోసారి విశ్వాసముంచిన పార్టీ అధిష్టానానికి, తనను సన్మానించిన నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటానని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కీతవారిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కీత సోమయ్య, వార్డు సభ్యులు బండారు సైదులు, ఎస్.కె సఫియా మీరా, గూడెపు వెంకటేశ్వర్లు, బండారు అంజయ్య, కీత రామనాథం, అబ్బురం, మస్తాన్, కోటయ్య, సైదులు, రేఖ, బక్కయ్య, అనంత రాములు, శ్రీను, కోటయ్య, సైదులు, వెంకన్న, నాగులు, నాగయ్య, జానీ తదితరులు పాల్గొన్నారు.