12 July, 2026 | 5:46 PM

Breaking News

ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •  

వరదనీటిలో చాపర్ అత్యవసర ల్యాండింగ్

03-10-2024 12:25 AM

ఇంజిన్ విఫలం కావడంతో పైలట్ సమయస్ఫూర్తి

పాట్నా, అక్టోబర్ 2: ఇంజిన్ విఫలమైన వాయుసేన చాపర్‌ను పైలట్ సమయస్ఫూ ర్తి ప్రదర్శించి పెనుప్ర మాదం తప్పించాడు. హెలికాప్టర్‌లో ఉన్న సహాయక సామగ్రిని పడేసి వర దనీటిలో అత్యవసర ల్యాండ్ చేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. వరదలతో అతలాకుతలమైన బీహార్‌లో వాయుసేనకు చెందిన హెలికాప్టర్ రిలీఫ్ సామగ్రిని మోసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

చాపర్‌లో నలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం మధ్యాహ్నం దర్భంగా వాయుస్థావరం నుంచి బయలుదేరిన చాపర్ ముజఫర్‌పూర్‌వరకు రాగా ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో ప్రజలు లేని ప్రాంతంలో ల్యాండింగ్ చేశారు.