12 July, 2026 | 6:23 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక

12-07-2026 05:22 PM

ధర్మపురి,(విజయక్రాంతి): గత 2నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాటేడాన్ స్పోర్ట్స్ కంప్లెస్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తుమ్మెనాల గ్రామం ధర్మపురి మండలంకు చెందిన మామిడిపెల్లి గణేష్ అండర్ 19  సీనియర్ 51 కేజీ విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మేడల్ సాధించాడు.

ఆగస్టు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు  గణేష్ ఎంపిక అయ్యాడని కిక్ బాక్సింగ్ కోచ్ కస్తూరి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు క్రీడాకారుడు గణేష్ ను  అభినందించారు.