24 August, 2026 | 11:47 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

హత్య కేసుని చేదించిన పోలీసులు

24-08-2026 11:16 PM

చౌటుప్పల్: పంతంగి గ్రామంలోని శనగలగుట్ట వద్ద అంకిరెడ్డిగూడెంకు చెందిన రాపోలు దానయ్య (36) హత్య కేసును చౌటుప్పల్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ జె. మన్మథ కుమార్ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో దానయ్య భార్య శారద (34), దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివ అలియాస్ చింటూ (19) కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

దానయ్య తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివ, శారదలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించడంతో పాటు, అనుమానితులను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు. హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి అభినందించారు.