calender_icon.png 14 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవ హక్కుల రక్షణ సమితి పాస్టర్స్ అండ్ లీడర్స్ సదస్సు విజయవంతం..

13-05-2025 11:15:06 PM

ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా..

హనుమకొండ (విజయక్రాంతి): క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హసన్ పర్తి కల్వరి ప్రార్థన మందిరంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు పాస్టర్ సింగారపు రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ రెవ. విలియం కేరి అధ్యక్షతన వరంగల్ ఉమ్మడి జిల్లా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ జోసఫ్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ జన్ను యిర్మీయా మాట్లాడుతూ.. ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆశీర్వదించి, దేవుని మహిమ కలుగును గాక, సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేసినారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ రెవ. ఎలీషా, ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ల్యాదేల్ల రమేష్ పాల్, ఇంటర్నేషనల్ ట్రెజరర్ బ్రదర్ మాట్ల రాజు, నేషనల్ చీఫ్ అడ్వైజర్ రెవ అశోక్ పాల్, అడ్వైజర్, స్థానిక సంఘ కాపరి రెవ.ఆర్.వి. రత్నం, నేషనల్ ఉపాధ్యక్షులు రెవ.డాక్టర్ జన్ను ప్రభాకర్, రెవ జన్ను ఏసన్న, నేషనల్ ఉపాధ్యక్షులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు రెవ. డా జూపాక యాకోబు, అడ్వైజర్ బ్రదర్ జె.ఆర్ సాల్మన్, రెవ.జన్ను ఏసు పాదం, రెవ.ఇసంపల్లి శ్రీనివాస్, నేషనల్ జాయింట్ సెక్రెటరీ.రెవ సుదర్శన్, కల్చరల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బ్రదర్ జన్ను జోషి బొయజ్, ప్రచార కార్యదర్శి నేషనల్ రెవ రవి పాల్, పాస్టర్ సిహెచ్. కృపాల్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెవ.బెన్ని, రెవ.రాజు కుమార్, నేషనల్ ప్రచార కార్యదర్శి రెవ. కోట జాషువా, బ్రదర్ గుంటుకు రమేష్, రెవ. దేవదాసు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రచార కార్యదర్శి పాస్టర్ జన్ను ఆరోగ్యం, ప్రచార కార్యదర్శి పాస్టర్ యెహోషువ, ప్రచార కార్యదర్శి పాస్టర్ ఐజయ్య, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు బ్రదర్ రాజేష్, ఆరు జిల్లాల నాయకులు, పాస్టర్స్, లీడర్స్ పాల్గొన్నారు.