14-05-2025 12:00:00 AM
విజేతలకు అవార్డులు అందజేసిన పుల్లెల గోపీచంద్
ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి) : నగరం లో హైసియా(హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంట్ర్పజెస్ అసోసియేషన్) నిర్వహించిన అతిపెద్ద ఇంటర్ కార్పొరేట్ స్పోరట్స్ టోర్నమెంట్ 2024-25లో ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఓవరాల్ చాంపియన్షిప్ సొంతం చేసుకుందని హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నందెల్ల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ టీసీఎస్ రన్నరప్గా నిలవగా, సింక్రోనీ మూడో స్థానం సాధించిందన్నారు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాం పస్లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో భారత బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ గచ్చిబౌలి వీపీ, డీసీ హెడ్ రఘు బొడ్డుపల్లి పాల్గొన్నారు.