calender_icon.png 28 May, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

14-05-2025 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి):  రెండు తెలుగు రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, ఏపీ ఓబిసి సంఘం అధ్య క్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ  ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పోస్టుల భర్తీలో రెండు ప్రభుత్వాలు అలసత్వాన్ని విన్నాడాలన్నారు.

అదేవిదంగా ఖాళీ గా ఉన్న ఉద్యోగాలన్నిటిని భర్తీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దీనికోసం ప్రభుత్వ శాఖల్లో శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య సమగ్ర వివరాలను సీఎంలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 డీఎ స్సీ మిగిలిపోయిన అభ్యర్ధులు కు ఎంటిఎస్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరి గే విధంగా 1482 మంది రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు.

గ్రూ ప్-1 సర్వీస్ కింద గత 10 ఏళ్లుగా పోస్టుల భర్తీ చేయలేదన్నారు. అలాగే గ్రూప్-2 సర్వీస్ కింద 6 ఏళ్లుగా నోటిఫికేషన్ వేయలేదన్నా రు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారన్నారు. గత 10 ఏళ్లుగా గ్రూప్-1 స్థాయి పోస్టులు, గ్రూప్-2 పోస్టులలో ఎంతోమంది రిటైర్ అ య్యారని, ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చా రో లెక్కించి భర్తీ చేయాలన్నారు.

గ్రూప్-4 సర్వీస్ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టు లు గత 25 ఏళ్లుగా జిల్లా ఆఫీసులు, క్రింది స్థాయి ఆఫీసుల పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. కేవలం సచివాలయం, డైరెక్టరేట్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని, మిగతా జిల్లా, మండల స్థాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడం లేదన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల జారీచేసిన గ్రూప్-4 సర్వీస్ పోస్టులలో జిల్లా పోస్టులు కలిపారని, మొత్తం పోస్టులు తక్కువగా యున్నా యన్నారు.

కావున అన్నీ జిల్లాల్లో ఉన్న ఖాళీలు లెక్కించి భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో 98 డీఎస్సీ మిగిలిపోయిన అభ్యర్ధుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, సంజీవ్, బైరవకోన శ్రీనివాస్, బాబయ్య రమేశ్. లలిత, చిన్ని కృష్ణ, రాజశేఖర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.