25 May, 2026 | 6:55 PM

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్

25-05-2026 06:20 PM

తాండూర్ డిపోల ముందు నిరసన

తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నిరసన  చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బెనిఫిట్స్, పెన్షన్స్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు.