ఈత సరదా విషాదంగా మారొద్దు: ఎస్సై ప్రవీణ్ కుమార్
మఠంపల్లి,(విజయక్రాంతి): ఈత సరదా విషాదకరంగా మారొద్దని, చిన్న చిన్న నిర్లక్ష్యాలే ప్రాణ నష్టానికి దారితీయవచ్చని సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవి కాలంలో విద్యార్థులకు సెలవులు రావడంతో ఈత నేర్చుకోవడానికి, యువకులు ఎండ వేడి నుంచి సేద తీరడానికి బావులు, కాలువలు చెరువులకు వెళ్లే అవకాశం ఉందని ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుంది.
ఈత సరదా విషాదంతం కావద్దని తెలిపారు. ఈత రాని వారు ఒంటరిగా బావుల దగ్గరికి వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు స్విమ్మింగ్ ట్రైనర్ లు లేదా తండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లల కదిలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, చెరువులు,కుంటలు దగ్గరికి ఒంటరిగా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






