హైదరాబాద్ మెట్రో స్వాధీనం.. చిక్కుముడి వీడేదెప్పుడు?

11-09-2026 | 05:00am
  1. రూ.13,558 కోట్ల రుణ భారంపై స్పష్టత కరవు
  2. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎల్ & టీ విజ్ఞప్తి
  3. ఎస్బీఐ క్యాపిటల్స్ వైపు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  4. సమస్యల్లో నగర ప్రజా రవాణా వ్యవస్థ

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం(Hyderabad City) పట్ల ఎంతో కీలకమైన ‘మెట్రో రైల్’ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. ’మనం ఇక ఈ ప్రాజెక్టును నిర్వహించలేం’ అని ఒప్పంద సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేయడంతో, ప్రజా రవాణా వ్యవస్థకు విఘాతం కలగకుండా సర్కారే దీనిని స్వాధీనం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, ప్రాజెక్టుపై ఉ న్న భారీ రుణభారం ఈ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారింది. 

ఆర్థిక భారం.. ఐఆర్‌ఎఫ్సీ ’నో’...

మెట్రో ప్రాజెక్టుపై ప్రస్తుతం రూ.13,558 కోట్ల వరకు రుణం పేరుకుపోయింది. ఈ భారీ రుణాన్ని రీఫైనాన్స్ చేసి, తక్కువ వడ్డీకి తగ్గించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ని సంప్రదించింది. కానీ సాంకేతిక, ఆర్థిక నిబంధనల వల్ల రుణం ఇచ్చేందుకు ఐఆర్‌ఎఫ్సీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం (ఎస్బీఐ క్యాపిటల్స్) వైపు ఆశగా చూస్తోంది. స్వాధీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు ప్రారంభమై దాదాపు ఏడాది గడుస్తున్నా, ని ధుల సర్దుబాటు కాకపోవడంతో చర్చలు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.

రోజుకు 5 లక్షల మంది రాకపోకలు

ప్రస్తుతం మెట్రో రైలు ప్రతిరోజూ నగర ప్రజలకు కీలకమైన రవాణా సాధనంగా సే వలు అందిస్తోంది.రోజువారీ ప్రయాణికులు మూడూ కారిడార్లలో కలిసి ప్రతిరోజూ 4.8 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.రోజుకు సగటున 1,000 నుంచి 1,050 ట్రిప్పులు తిప్పుతున్నారు. ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మించినప్పుడు తెచ్చిన రుణాలకు చెల్లించాల్సిన భారీ వడ్డీలు, రోజువారీ నిర్వహణ వ్యయం వల్ల ఎల్ అండ్ టీకి నష్టాలు తప్పడం లేదు.

ప్రయాణికులకు పెరుగుతున్న తిప్పలు

నిర్వహణ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రత్యక్షంగా ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది.

తీవ్రమైన రద్దీ...

ప్రతీ రోజు పీక్ అవర్లలో (ఉదయం, సా యంత్రం) రద్దీని తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో మెట్రోలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యం గా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టు గతంలో బోగీలను పెంచాలన్న ప్రతిపాదన ఆటకెక్కింది.ప్రస్తుతం ప్రతి రైలుకు 3 భోగీలు మాత్రమే ఉన్నాయి. వీటిని 6 భోగీలకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, నిధుల కొరతతో కొత్త భోగీలను ఎల్ అండ్ టీ కొనుగోలు చేయలేకపోతోంది.

స్టేషన్లలో వేచి చూడటం

టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ గేట్ల వద్ద రద్దీ నియంత్రణకు అవసరమైన సాంకేతిక మార్పులు కాకపోవడం వల్ల సమయం వృథా అవుతోంది.ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలుఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు మార్గాలను పరిశీలిస్తోంది. ఎస్బీఐ క్యాపిటల్స్ ద్వారా తక్కువ వడ్డీకి సుదీర్ఘ కాల పరిమితితో రుణం పొందడం.మెట్రోను సంపూర్ణంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం.

రెండో దశ (ఫేస్ 2) విస్తరణ...

ఎయిర్పోర్ట్ లైన్ సహా మిగిలిన విస్తరణ కారిడార్ల కోసం కేంద్ర ప్రభుత్వ వాటాను సాధించి, ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజా రవా ణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం త్వరితగతిన తగిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు