29 July, 2026 | 8:59 PM

లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం.. అంటే ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి

29-07-2026 08:17 PM

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్

సరదాగా సినిమా కు వెళ్ళినా..

పెట్రోల్ బంకు లో కూడా..

"సార్..మీ ఫోన్ నెంబర్ ఇస్తారా..?!

హైదారాబాద్: లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తామని చెప్పే వాళ్లకి ఫొన్ నెంబర్లు ఇవ్వద్దని వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదారాబాద్ లో మాట్లాడుతూ.. కొన్ని వ్యాపార సంస్థలు తెలివిగా సార్వత్రిక ప్రదేశాలలో జనం వద్ద నుంచి  ఫోన్ నెంబర్లను సేకరించి, ఆ తర్వాత "మీ కు లక్కీ డ్రా లో గిఫ్ట్ వచ్చింది" అంటూ పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. పెట్రోల్ బంకులు, సినిమా టాకీస్ ల వద్ద జనం జాగృతం గా ఉండి. తమ ఫొన్ నెంబర్ లను ఇవ్వకుండా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. 

డెక్కన్ రిసార్ట్స్ మోసం

డెక్కన్ రిసార్ట్స్ అనే సంస్థ హాలిడే ప్యాకేజ్ పేరిట సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న నవకేతన్ కాంప్లెక్స్ లో "దుకాణం" తెరిచి వేలాది మంది నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి, వారినుంచి కోట్ల రూపాయలు దోచుకుని మోసం చేసిందన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ఫలితం లేదని రఘునందన్ వివరించారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా.. ఫ్రీ గిఫ్ట్ లకు ఆశ పడి.. మోసపోతున్నారని రఘునందన్ స్పష్టం చేశారు. అందుకే..ఎక్కడ పడితే.. అక్కడ ఎవరికి పడితే వారికి ఫోన్ నంబర్ లు ఇవ్వడం కూడదని రఘునందన్ సూచించారు. రియల్ ఎస్టేట్ వెంచర్ ల వాళ్ళు అధికంగా.. నిరుద్యోగులకు ఆశ చూపి,టార్గెట్స్ పెట్టీ బిజినెస్ చేస్తున్నారని రఘునందన్ వివరించారు.ఎక్కడైనా సరే డబ్బు తో..వ్యవహారం విషయంలో ఆచితూచి అడుగువేయాలని రఘునందన్ హితవు చెప్పారు.విద్యాధికులు సైతం కొందరి మాయ మాటలను నమ్మి మోసపోతున్నారని..అలా కాకుండా అప్రమత్తంగా..ఉండాలని ఏ మాత్రం ఎమరుపాటుగా ఉండకూడదని రఘునందన్ జనబాహుల్యాన్ని జాగృతం చేశారు.