జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి
29-07-2026 08:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సర్ ప్రక్రియ 98% పూర్తి అయినట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 3 వరకు ప్రభుత్వం సర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని 18 మండలాలు 400 గ్రామపంచాయతీలు మూడు మున్సిపాలిటీలో సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. ఓటర్లు ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ డేటా నమోదు చేయడం జరిగిందని వివరించారు. మిగిలిపోయిన కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు.






