అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ స్థావరాలపై దాడి
296 అక్రమ గ్యాస్ సిలిండర్ లు స్వాధీనం
మనోహరబాద్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మనోహరాబాద్ మండలం కాళ్ళకాల్ గ్రామ శివారులో అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ స్థావరాల(illegal gas refilling stations)పై సివిల్ సప్లయి అధికారి నర్సింలు, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్(Manoharabad SI Subhash Goud)లతో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించినారు. అందిన సమాచారం మేరకు పగడ్బంది వ్యూహంతో దాడి చేయగా ఈ గోదాములో అక్రమ 296 గ్యాస్ సిలిండర్ లు నింపివున్న వాటిని సీజ్ చేసారు. అక్రమ గ్యాస్ నిర్వహకుని పై కేసు నమోదు చేశారు.
గత కొంతకాలంగా రహస్యంగా అక్రమ గ్యాస్ సిలిండర్ లు నింపికుంటూ లక్షల్లో రూపాయలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సివిక్ సప్లై అధికారులు, పోలీసులు దాడి చేయగా గుట్టు రట్టయింది. ఇలాంటి అక్రమ గ్యాస్ వ్యాపారాలు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. భారీస్థాయిలో అక్రమ గ్యాస్ సిలిండర్ల వ్యాపారం కొనసాగిస్తున్న స్థావరాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యా నంద్ అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.