14-11-2025 07:23:59 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్ ను ఆసుపత్రి పర్యవేక్షకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం ఆర్ ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేసి శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి ప్రతిరోజు వైద్య చికిత్స కొరకు ప్రజలు వస్తుంటారని, వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఆర్.ఓ. ప్లాంట్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్రజలు ఆర్.ఓ. ప్లాంట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.